రైతులు సాగు విధానాలను మార్చుకోవాలి : కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు సాగు విధానాలను మార్చుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దేశంలో ఏ నదిలో కూడా ఆశించిన నీటి ప్రవాహం లేదని తెలిపారు. కరువు పరిస్థితుల దృష్ట రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిందని మాట్లాడుతున్నారని ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సరైంది కాదని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నారం, సుందిళ్లలలో నీటిని నిల్వ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిందేనని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగి పోవడానికి ఎవరూ బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. జరిగిన దానికి బాధ్యత వహించకుండా జరగబోయేదానికి బాధ్యత వహిస్తాం అనడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 70వేల ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు అందించిందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విడ్ ప్రొకో ద్వారా వచ్చినవేనని వాటిని ఉద్యమకారులకు పంచాలని స్వయంగా కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. బిఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయామనే అక్కసుతో సభ్యత, సంస్కారం మరచి మాట్లాడుతున్నారని, కొన్ని పత్రికలు, యుట్యూబ్ చానళ్ళు పెట్టుకొని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ రైతులను, ప్రజలను, యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కాంగ్రెస్ నేతలు భూర్ల శంకర్, గట్టు రమేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Views: 131
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
