గన్నెవానిపల్లెలో కప్పతల్లి వేడుకలు

గన్నెవానిపల్లెలో కప్పతల్లి వేడుకలు

ముస్తాబాద్,: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నెవానిపల్లె గ్రామంలో గ్రామ సర్పంచ్ రేసు రఘు ఆధ్వర్యంలో శనివారం సంప్రదాయబద్ధంగా కప్పతల్లి కార్యక్రమాన్నినిర్వహించారు.సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు పంటలు బాగా పండాలని, గ్రామంలో సుభిక్షం నెలకొనాలని ఆకాంక్షిస్తూ యువకులు గ్రామంలోని దేవాలయాలకు నీళ్లు పోస్తూ గ్రామమంతా ఊరేగింపుగా తిరిగి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, కప్పతల్లి ఆచారం గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ విశ్వాసమని, ప్రకృతి అనుకూలించి మంచి వర్షాలు కురవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల కష్టాలు తీరాలని, పంటలు పుష్కలంగా పండాలని వారు ఆకాంక్షించారు.గ్రామ సర్పంచ్ రేసు రఘు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే గ్రామ అభివృద్ధికి పునాది అని, మంచి వర్షాలు కురిసి ప్రతి రైతు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, రైతులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామంలో భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన ఈ సంప్రదాయ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ 
శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు