దుర్గామాత నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
నిమజ్జన ప్రాంతము ముసలమ్మ చెరువు పరిశీలించిన సర్పంచ్ భోగా ఆనంద్
మోర్తాడ్ ముసలమ్మ చెరువు దుర్గామాత నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక సర్పంచ్ భోగా ఆనంద్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ సైఫుద్దీన్ విడీసీ సభ్యులు ఎల్లాల రమేష్ ఆధ్వర్యంలో నిమజ్జనం కోసం సిద్ధం చేసిన చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జనానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, నీటి వసతి తదితర అంశాలను పరిశీలించి, వేడుకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ముసలమ్మ చెరువులో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం చేపట్టిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. దుర్గామాత నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ భోగ ఆనంద్ విడీసీ సభ్యులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సౌకర్యార్థం నిమజ్జన ఏర్పాట్లు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


