పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ: నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డినివాళులర్పించారు.మంగళవారం ఉదయం బండ శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేరుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన,వారి కుటుంబానికి తన అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు.నల్గొండ పట్టణంలో పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ, నాణ్యమైన స్వీట్స్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి బండ శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన మరణం నల్గొండ వ్యాపార వర్గానికి తీరని లోటని ఈ సందర్భంగా గుత్తా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,బీరవెల్లి గోపాల్ రెడ్డి,పాదూరి ఇంద్ర సేన రెడ్డి, యామ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: