హైదరాబాద్‌లో కృష్ణ ఆటోమోటివ్ కార్యకలాపాల విస్తరణ

బీఎండబ్ల్యే సర్వీస్ వర్క్‌షాప్, ప్రీమియం సెలెక్షన్ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌లో కృష్ణ ఆటోమోటివ్ కార్యకలాపాల విస్తరణ

హైదరాబాద్: తెలంగాణలో లగ్జరీ కార్ల వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కృష్ణ ఆటోమోటివ్ తన కార్యకలాపాలను విస్తరించింది. హైదరాబాద్‌లో బీఎండబ్ల్యే అధీకృత డీలర్ భాగస్వామిగా ఉన్న కృష్ణ ఆటోమోటివ్.. ఆధునిక సర్వీస్ వర్క్‌షాప్‌తో పాటు ప్రత్యేక బీఎండబ్ల్యే ప్రీమియం సెలెక్షన్ (BPS) కేంద్రాన్ని ప్రారంభించింది. దీంతో వినియోగదారులకు కొత్త బీఎండబ్ల్యే కార్ల కొనుగోలు, ధ్రువీకరించిన ప్రీ-ఓన్డ్ వాహనాల ఎంపిక, నాణ్యమైన ఆఫ్టర్ సేల్స్ సేవలు ఒకే సంస్థ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.హైదరాబాద్‌లో కృష్ణ ఆటోమోటివ్ కార్యకలాపాలకు గచ్చిబౌలిలోని రిటైల్.నెక్స్ట్ (Retail.NEXT) షోరూమ్ ప్రధాన కేంద్రంగా ఉంది. బీఎండబ్ల్యే గ్రూప్ ఆధునిక రిటైల్ విధానానికి అనుగుణంగా ఈ షోరూమ్‌ను రూపొందించారు. తాజాగా ప్రారంభించిన సర్వీస్ వర్క్‌షాప్, బీఎండబ్ల్యే ప్రీమియం సెలెక్షన్ కేంద్రాలతో కలిసి వినియోగదారులకు సమగ్ర సేవలు అందించనుంది. ఆధునిక నిర్మాణ శైలి, డిజిటల్ సదుపాయాలు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రీమియం వాహన కొనుగోలు, నిర్వహణలో వ్యక్తిగత అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సదుపాయాలను అభివృద్ధి చేశారు.ఈ సందర్భంగా బీఎండబ్ల్యే గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. తెలంగాణలోని లగ్జరీ ఆటోమొబైల్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న బీఎండబ్ల్యే గ్రూప్ ఇండియా, వాహన యాజమాన్యంలోని ప్రతి దశలోనూ అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడి వినియోగదారులు పనితీరు, సాంకేతికత, వ్యక్తిగత సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.రిటైల్.నెక్స్ట్ షోరూమ్‌కు తోడుగా కొత్త సర్వీస్ వర్క్‌షాప్, బీఎండబ్ల్యే ప్రీమియం సెలెక్షన్ కేంద్రం అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. కొత్త బీఎండబ్ల్యే లేదా ధ్రువీకరించిన ప్రీ-ఓన్డ్ కారును కొనుగోలు చేయడం నుంచి నమ్మకమైన ఆఫ్టర్ సేల్స్ సేవలను పొందడం వరకు అన్ని సేవలు మరింత సులభతరం అవుతాయని చెప్పారు. తెలంగాణలో వినియోగదారులతో దీర్ఘకాలిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ విస్తరణ దోహదపడుతుందని వెల్లడించారు.కృష్ణ ఆటోమోటివ్ డీలర్ ప్రిన్సిపల్ సచిత్ పస్సీ మాట్లాడుతూ.. ఈ ప్రాంత వినియోగదారుల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ బీఎండబ్ల్యే గ్రూప్ ఇండియాతో తమ ప్రయాణం కొనసాగుతోందన్నారు. ఇప్పటికే ఉన్న విక్రయ కేంద్రాలకు బీఎండబ్ల్యే ప్రీమియం సెలెక్షన్, అత్యాధునిక సర్వీస్ వర్క్‌షాప్‌ను జోడించడం కీలక ముందడుగని పేర్కొన్నారు. అధునాతన వర్క్‌షాప్ సదుపాయాలతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉన్నారని, పారదర్శకత, శ్రద్ధ, వ్యక్తిగత సేవలతో బీఎండబ్ల్యే వినియోగదారులకు వాహన యాజమాన్యంలోని ప్రతి దశలోనూ సహకారం అందిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించడం, తెలంగాణలో పెరుగుతున్న బీఎండబ్ల్యే వినియోగదారులకు సేవలందించడం గర్వంగా ఉందన్నారు.గచ్చిబౌలిలో రిటైల్.నెక్స్ట్ షోరూమ్*హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాధవ రెడ్డి కాలనీలో మహావీర్ గేట్‌వే వద్ద కృష్ణ ఆటోమోటివ్ రిటైల్.నెక్స్ట్ షోరూమ్ ఉంది. 5,600 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ షోరూమ్‌లో ఒకే చోట ఆరు బీఎండబ్ల్యే కార్లతో పాటు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.*బాలానగర్‌లో సర్వీస్ వర్క్‌షాప్, ప్రీమియం సెలెక్షన్ కేంద్రం*బాలానగర్‌లోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియా రోడ్, 29/A వద్ద 19,300 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బీఎండబ్ల్యే ప్రీమియం సెలెక్షన్ షోరూమ్‌లో రెండు ప్రీ-ఓన్డ్ వాహనాలను ప్రదర్శించే సదుపాయం ఉంది. దీనికి అనుబంధంగా పూర్తిస్థాయి బీఎండబ్ల్యే సర్వీస్ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు.ఈ వర్క్‌షాప్‌లో మొత్తం 15 సర్వీస్ బేలు ఉన్నాయి. వీటిలో రెండు ఆర్‌ఏటీసీ బేలు, 10 మెకానికల్, ఎలక్ట్రికల్ బేలు, మూడు బాడీ అండ్ పెయింట్ బేలు ఉన్నాయి. వాహనాల నిర్వహణ, మరమ్మతులు, సమగ్ర ఆఫ్టర్ సేల్స్ సేవలు అందించేందుకు ఈ వర్క్‌షాప్‌ను రూపొందించారు. వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక లైఫ్‌స్టైల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.బీఎండబ్ల్యే ప్రీమియం సెలెక్షన్, ఆఫ్టర్ సేల్స్ సేవలు ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా సమగ్ర సేవలను ఒకే చోట పొందవచ్చు.కృష్ణ ఆటోమోటివ్ బీఎండబ్ల్యే గ్రూప్ ఇండియాకు చండీగఢ్, లూధియానాలో కూడా విక్రయాలు, సర్వీస్ కేంద్రాల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో బీఎండబ్ల్యే గ్రూప్ ఇండియాతో సంస్థ అనుబంధం మరింత బలోపేతమైంది.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News