ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల సన్నాహాలు
చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో చేపట్టబోయే కార్యక్రమాలపై ఆదివాసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో వేడుకల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి, ఆగస్టు 9న జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల ముఖ్య ఘట్టంగా, వీరయోధుడు కొమరం భీమ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్ణయించారు,ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని చర్ల మండల సీఐ అలెం. రాజు వర్మకు ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు అందజేశారు, పోలీసు అధికారి సమక్షంలో కరపత్రాన్ని విడుదల చేసిన అనంతరం, ఆదివాసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ ప్రాంతంలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యామని తెలిపారు, ఈ వేడుకలను జయప్రదం చేసేందుకు మండలంలోని ఆదివాసీ సోదర సోదరీమణులు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు,అడవి, భూమి, నీరు తమ హక్కులని చాటిచెప్పే ఈ మహత్తర సందర్భాన్ని ఐక్యంగా జరుపుకుందామని వారు ఆకాంక్షించారు ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ చైర్మన్ వాసం. ముసలయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నూగురు తాలూక, ఇరప. శ్రీనివాస్ రావు, మాజీ జడ్పీటీసీ సోయం. రాజారావు, ఇరప. రాజు దొర, తాటి. రామకృష్ణ, పూనెం. వరప్రసాద్, ఇరప. అపర్ణ, తాటి. భూపతి దొర తదితర ముఖ్య నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. జై ఆదివాసీ నినాదాలు, కొమరం భీమ్ అమర్ రహే అనే నినాదాలతో ఈ ప్రాంతమంతా ఆదివాసీ చైతన్యంతో నిండిపోయింది.
Views: 47
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
