చలో హైదరాబాద్ వాయిదా..

జేఏసీల బండారం బట్టబయలు!

చలో హైదరాబాద్ వాయిదా..

  • ఉద్యోగుల పోరాటాన్ని నీరుగార్చిన జేఏసీలు.. హక్కుల కోసం సమరానికి జాయింట్ స్ట్రగుల్ కమిటీ పిలుపు
  • పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దుపై ఉత్తర్వులు వచ్చే వరకు పోరాటం ఆగదు
  • రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి

అక్కన్నపేట, : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేయడంపై జాయింట్ స్ట్రగుల్ కమిటీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ పరిణామం తాము ముందుగానే ఊహింWhatsApp Image 2026-09-12 at 9.57.49 AMచినదేనని జాయింట్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర చైర్మన్ టి. ప్రభాకర్, సమన్వయకర్త సయ్యద్ షౌకత్ అలీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు బి. మురళీధర్ గౌడ్, డి. హరికృష్ణ, దేవేందర్, ఎస్సీ కుమాసిర్, ఎస్.ఎ. జలీల్, ఆర్. రోహిత్ నాయక్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

జేఏసీల వైఫల్యం బట్టబయలు

తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రస్తుతం ఉన్న రెండు ఉద్యోగ జేఏసీలు ఘోరంగా విఫలమయ్యాయని వారు విమర్శించారు. సమస్యల పరిష్కారం పట్ల జేఏసీ నాయకత్వాలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమైన సమయంలో చలో హైదరాబాద్‌ను వాయిదా వేసేవారు కాదన్నారు. ఆందోళనను వాయిదా వేయడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీశారని శ్రీనివాస్ఆరోపించారు.

ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు

గతంలో మాదిరిగానే ఉద్యమాలను నామమాత్రంగా నిర్వహించి మధ్యలోనే విరమించడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటోందని ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జాయింట్ స్ట్రగుల్ కమిటీని పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చిత్తశుద్ధితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ సంఘాలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కుల పోరాటాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడితే నాయకత్వాలు ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

ఉత్తర్వులు వచ్చే వరకు సమరం

పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని జాయింట్ స్ట్రగుల్ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధనే ధ్యేయంగా జరిగే ఈ పోరాటంలో ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్ భాగస్వామి కావాలని కోరారు. ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను తిప్పికొట్టి, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రకటనను వెల్లడించారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ