మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

  • అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
  • ఎమ్మెల్యే కడియం శ్రీహరి
 

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీని సమన్వయంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మాజీ ఉప మఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖల ద్వారా సుమారు 60 కోట్ల నిధులను మంజూరు చేసిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందేలా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావులేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మొదటి విడత పనులను ఆగస్టు 31లోగా, రెండో విడత పనులను అక్టోబర్ 10లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అన్నారు. మున్సిపాలిటీలో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, స్టేడియం, ఓపెన్ జిమ్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, జంతు వధశాల, తదితర అభివృద్ధి పనులను పూర్తిచేయాలని తెలిపారు. పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని చేపట్టాలని అన్నారు. పట్టణాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు ఉద్యానవన శాఖ సమన్వయంతో విస్తృతంగా మొక్కలు నాటాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ హైవేపై పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కల పెంపకం కోసం లేఅవుట్ తయారు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెవిపారు. ఈసమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్‌ కుమార్, ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్ రాధా కృష్ణ, తహసీల్దార్ స్వప్న, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.