కార్మిక చట్టా లను సై తం లెక్కచేయని ఎమ్మెస్ ఆమ్స్
ప్రో లైఫ్ సైన్స్ కంపెనీపై చర్యలు తీసుకోండి
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య
బాలానగర్ : బాలనగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో వెలసిన ఎమ్మెస్ ఆన్స్ ప్రో లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వేనెంబర్ 631/ఎ 1 పరిశ్రమ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడి చేస్తున్న పరిశ్రమ యాజమాన్యంపై చట్టప రమైన చర్యలు తీసుకోవాలని ముదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య జిల్లా కలెక్టర్ కు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉడిత్యాల గ్రామంలో ఎమ్మెస్ ఆమ్స్ ప్రో లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నంబర్ 631/ఎ 1 పరిశ్రమ నందు గత 4,5 సంవత్సరాల నుండి జనరల్ షిఫ్ట్ లో దాదాపు 150 మంది, మిగతా షిఫ్ట్ లలో దాదాపు 40 మంది కార్మికులతో పరిశ్రమ యాజ మాన్యం పనిచేయుచుకుంటున్నారు. వారికి ఈఎస్ఐ, ఈపీఎఫ్ లను చెల్లించకుండా చట్టాలను ఉల్లంఘిస్తూ పరిశ్రమ యాజమాన్యం శ్రమదోపిడి చేస్తున్నారు. ఇట్టి విషయమై ఏ కార్మికుడు ప్రశ్నించిన మరుసటి రోజు అతని ఉద్యోగం ఉండదని యాజమాన్యం కార్మికులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ పరిశ్రమ పేరు లేబర్ ఆఫీసు నందు నమోదు కాలేదంటే పరిశ్రమలో ఎంత మేరా నియంతృత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెస్ ఆమ్స్ ప్రో లైఫ్ సైన్స్ ప్రైవేట్ పరిశ్రమ ప్రారంభమై నేటికి ఐదు సంవత్సరాలు దాటుతున్న మహబూబ్నగర్ లేబర్ ఆఫీస్ నందు పరిశ్రమ పేరు నమోదు కావకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కావున కార్మిక చట్టాలను లెక్కచేయని, కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎమ్మెస్ ఆమ్స్ ప్రో లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


