బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యం లో అంబేద్కర్ కు వినతి పత్రం.

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యం లో అంబేద్కర్ కు వినతి పత్రం.

బాన్సువాడ .నసురుల్లాబాద్ : కేంద్రం లో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో భారత రాజ్యాంగ కర్త అంబేద్కర్ విగ్రహాని కి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు నర్సింలు గౌడ్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు  13 డిక్లరేషన్లు 420 అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయిందని ఇలాంటి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని వారు ఆవేదన చెందారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకే రక్షణ లేకుంటే సామాన్య పౌరులకు మహిళలకు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కాపాడుతుందో అని  ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ హామీల తో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారని ఆ సమయం ఆసన్నమైందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమం లో టేకుర్ల సాయిలు, లక్ష్మణ్, చౌహాన్,  రమేష్,  భూమయ్య,   రాజు,  గంగారం, డి. సాయిలు  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ