శ్రీగాథ లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
- అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు,కొత్త పింఛన్లు
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పర్శ హన్మాండ్లు
గంభీరావుపేట : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పర్ష హన్మాండ్లు అన్నారు.మంగళ వారం గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామంలో వేముల స్వరూప కాశాగౌడ్ ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సందర్భం గా పర్ష హన్మాండ్లు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారు, అనంతరం పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ.. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరవై సంవత్సరాలుగా స్వంత ఇల్లు లేనివారు గుడిసెల్లో శిథిలావస్థ ఇండ్లల్లో మరియు కిరాయికి ఉంటూ నానా అవస్థలు పడ్డారని ఇప్పుడు అలాంటివాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఆత్మగౌరవం తో సంతోషంగా ఉన్నారని పర్శ హన్మాండ్లు అన్నారు, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మెజారిటీ హామీలను నెరవేర్చడం జరిగిందని,ఫ్యూచర్ సిటీ,స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వంటి కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని పర్శ హన్మాండ్లు అన్నారు,మంచిచేసేవారిని గుర్తించి ఆదరించాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బందెల రాజు,ఏ ఎం సీ డైరెక్టర్ కల్వకుంట్ల లక్ష్మణ్ రావు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు వేముల శ్రీనివాస్ గౌడ్,తొండ్ల దేవేంద్ర నర్సయ్య, సుద్దాల రాజమణి మల్లేశ్,వార్డ్ సభ్యులు వేముల పర్షా గౌడ్,వేముల దేవరాజు గౌడ్,నాయకులు తొండ్ల నర్సిములు,కరికే ఉదయ్,వేముల యాద గౌడ్,గొట్టెముకుల వెంకటస్వామి,సిద్దా గౌడ్,గంగా గౌడ్,కాశాగౌడ్,రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


