5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ, సీఐ
హైదరాబాద్ : రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు డిమాండ్ చేసి, 5 లక్షలు లంచం తీసుకుంటున్న కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి లను ఏసీబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏసీబీ అధికారులను చూసి ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి పరుగులు పెట్టినట్లు సమాచారం. అనంతరం ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ అంజనేయులు కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పు తిప్పలు పెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు.రేషన్ బియ్యం కేసులో నిందితుల నుండి గత కొంతకాలంగా లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్ అంజనేయులు, వారితో పలు పనులను చేయించుకున్నట్లు ఆరోపణలు వున్నాయి. అదేవిదంగా కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని సీఐ సహితం వేధించటంతో, విసిగిపోయిన బాధితులు వేధింపులు తట్టుకోలేక ఏసీబీకి సమాచారం ఇచ్చారు. దీంతో కీసర చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో వుండి కారులో లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ని మొదట ఏసీబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


