డంపింగ్ యార్డును వోదలని దొంగలు
విలువైన వస్తువులు దొంగతనం
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే వన్ సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు షెడ్లో మంగళవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. గార్డెన్ ష్రెడ్డింగ్ యంత్రం మోటారు,కన్వెన్షన్ బెల్ట్ మోటారు (రెండు 5 హెచ్.పి మోటార్లు) దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు వాటి విలువ ఒక లక్ష ఇరవై వేల వరకు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ తెలిపారు. జరిగిన దొంగతనంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కమిషనర్ ఫిర్యాదు చేశారు. కాగా అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలు పని చేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. గతంలో కూడా దొంగతనం జరిగినట్లుగా పలువురు చెప్తున్నారు. అయితే ఏర్పాటు చేసిన కెమెరాలు సోలార్ సిస్టమ్,నెట్వర్క్ సిమ్ కార్డ్ సహాయంతో పని చేస్తాయి. అందులోని సిమ్ కార్డ్ రీచార్జ్ గత కొన్ని రోజుల క్రితం ముగియడంతో రికార్డ్ కానట్లు తెలుస్తుంది. లక్షల రూపాయలు వేచించి కొనుగోలు చేసిన విలువైన యంత్రాలకు రక్షణ కరువైందంటున్నారు పుర ప్రజలు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


