చౌటకూర్–లక్ష్మీసాగర్ రహదారిని వెంటనే బాగు చేయాలి
- భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్డు.. ప్రమాదకరంగా మారిన ప్రయాణం
- అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి
చౌటకూర్ మండల కేంద్రం నుంచి పోసానిపల్లి, బొమ్మారెడ్డిగూడెం మీదుగా లక్ష్మీసాగర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో రహదారి పరిస్థితి రోజురోజుకూ మరింత అధ్వానంగా మారుతోందని తెలిపారు.ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Views: 48
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
