ఫీజు బకాయి – బీజేపీ లడాయి

ఫీజు బకాయి – బీజేపీ లడాయి

పాపన్నపేట,  రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా, పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని బీజేవైఎం మండల అధ్యక్షుడు కేరూరి జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు ఉపకార వేతనాల బకాయిలను గత నాలుగు సంవత్సరాలుగా విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.5,000, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.6,500 చొప్పున మొత్తం రూ.11,500 చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ అందలేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు భారీగా పేరుకుపోయాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి బకాయిల వివరాలను సేకరించి, వాటిని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా అందజేస్తామని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఫీజు రీయింబర్స్‌ మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బికొండ రాములు, మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి, ప్రధాన కార్యదర్శులు గొల్ల నాగభూషణం, లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు బొక్కల భాగేష్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వడ్ల భాగేష్, పాపన్నపేట టౌన్ అధ్యక్షుడు సుంకరి కిష్టయ్య, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి చెవుల శ్రావణ్, బీజేవైఎం నాయకులు నరేష్, దుర్గాప్రసాద్, ఏబీవీపీ నాయకులు సంతోష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. 
Views: 80

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి