మూడో రోజూ కొనసాగిన భూ సర్వే
- ఎర్రవల్లి శివారులో ముమ్మరంగా భూ సర్వే
- డిజిటల్ సర్వేతో భూముల హద్దుల పరిశీలన
సంగారెడ్డి డెస్క్: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి సమీపంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూములపై అధికారులు శనివారం మూడో రోజు భూ సర్వే ఉదయం 9 గంటల నుండి నిర్వహించారు. సర్వే నంబర్ 325, సర్వే లో 388 ఎకరాలకు సంబంధించిన భూములపై గత రెండు రోజులుగా కొనసాగుతున్న సర్వే శనివారంతో పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలుగా అధికారులు వరదరాజ్‌పూర్ నుంచి శివార్, వెంకటాపూర్, ఎర్రవల్లి శివారు ప్రాంతాల వరకు డిజిటల్ సర్వే చేపడుతున్నట్లు సుదర్శన్ రాథోడ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ కొనసాగుతుండగా, మరో బృందం మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన పాత రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సర్వే పూర్తయిన అనంతరం రికార్డులతో వివరాలను సరిపోల్చి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


