ఘనంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
గంభీరావుపేట : వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదేశ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్తూపం వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ సీత రామచంద్రస్వామిని కోరుకుంటున్నా మని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గాండ్ల బాలలక్ష్మి, శ్రీజ, మోతి లత, కోమటి భాగ్య, రేణుక, మల్యాల రాజ్వీర్, బంగ్లా రాజు గౌడ్ గోపగారి లక్ష్మీనారాయణ గౌడ్, దేశెట్టి రాజశేఖర్, తాహెర్, టేకుమల్ల ప్రవీణ్, తాజోద్దీన్, తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


