జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలి
- జిల్లా అధ్యక్షులు రజనీకాంత్
కామారెడ్డి బ్యూరో : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ ఆవరణలో గాంధీ విగ్రహానికి అధ్యక్షులు రజనీకాంత్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకై దశాబ్దాలుగా పోరాటం సాగుతోందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి. రజనీకాంత్, టి.రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. టియుడబ్ల్యూజే(ఐజేయు) పిలుపు మేరకు 'దేశవ్యాప్త డిమాండ్ల దినోత్సవం' పురస్కరించుకుని శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముదాం శంకర్ పటేల్, కోశాధికారి ముదాం వెంకటేశ్వర్లు, అబిద్, శ్రీనివాస్ రెడ్డి, కౌసర్ అలీ, రజాక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముదం శివశంకర్, చక్రధర్ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


