ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గంభీరావుపేట : గంభీరావుపేట మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, ఇతర సంస్థల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ. గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని, ఆయన అనుసరించిన అహింస, సత్యం, శాంతి, స్వచ్ఛత వంటి విలువల ను పలువురు గుర్తు చేసుకున్నారు. ప్రజలందరూ గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన అహింసా మార్గం దేశ చరిత్రలో ప్రత్యేకమైనదని, సాధారణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.మండలంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ నరస గౌడ్, తాసిల్దార్ మారుతి రెడ్డి, ఎస్సై సిహెచ్. శ్రీకాంత్, ఎంపీడీవో రాజేందర్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు మద్దుల రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఉమా రెడ్డి విమల శంకర్ రెడ్డి, పిట్ల బాబు, నాగపురి బాలరాజు గౌడ్, చేకోటి మహేష్ యాదవ్, కమ్మరి గంగ సాయవ్వ రాజారం, ఎర్రం లతికా అంజిరెడ్డి, తోపాటు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు , ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి