గ్రామస్తుల ఆలోచన మేరకే ఆర్ఓబి నిర్మాణం

గ్రామస్తుల ఆలోచన మేరకే ఆర్ఓబి నిర్మాణం

  • ప్రభుత్వ విప్,శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు
  • పొత్కపల్లి లో ఆర్ఓబి నిర్మాణం కోసం స్థల పరిశీలన..
  • ఓదెల ఆలయ ప్రాంగణంలో రోడ్డు పనులు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్,
  • పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

WhatsApp Image 2026-10-02 at 2.29.00 PM పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు రైల్వే బ్రిడ్జి ఆర్ఓబి నిర్మాణం కోసం స్థలం పరిశీలించారు.పొత్కపల్లి ప్రభుత్వ పాఠశాల నుండి మార్కెట్ ల్యాండ్ ను అనుకోని గుంపుల రోడ్డుకు కనెక్టివిటీ కోసం గ్రామస్తుల అభిప్రాయం మేరకు స్థానిక నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. తదుపరి పొత్కపల్లి నుండి రూపు నారాయణపేట,కాల్వ శ్రీరాంపూర్ నుండి పొత్కపల్లి గ్రామం వరకు డబల్ రోడ్డు నిర్మాణ పనులను,ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. పొత్కపల్లి గ్రామంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం రైల్వే అధికారులు,ప్రజాప్రతినిధులు గ్రామస్తుల ఆలోచన మేరకు స్థలాన్ని పరిశీలించాలన్నారు.జమ్మికుంట రైల్వే బ్రిడ్జి పరిశీలించిన తరువాత పొత్కపల్లి రైల్వే బ్రిడ్జిని ఫైనల్ చేయాలని నిర్ణయించామన్నారు. పొత్కపల్లి నుండి రూపు నారాయణపేట డబల్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల తహశీల్దార్ వనజా నాయక్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి,స్థానిక సర్పంచ్ అంబాల సారమ్మ కొమురయ్య,ఉపసర్పంచ్ రెడ్డి రజనీకాంత్,పాలకవర్గం,పలు గ్రామాల సర్పంచ్ లు,ఉపసర్పంచ్ లు,సింగిల్ విండో డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-10-02 at 2.29.00 PM (1)

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి