ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

జాతిపిత ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: ఎంపీడీఓ కే. శంకర్

చౌటకూర్ :  చౌటకూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కే. శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ కే. శంకర్ మాట్లాడుతూ... దేశ స్వాతంత్య్ర పోరాటంలో అహింస, సత్యం అనే ఆయుధాలతో ప్రపంచానికే మార్గదర్శనం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీజీ కలలుగన్న 'గ్రామ స్వరాజ్యం' సాధనకు అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, సమాజంలో సేవా భావాన్ని పెంపొందించుకోవడమే గాంధీజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) పి. సువర్ణ, చౌటకూర్ సర్పంచ్ రామ్ రెడ్డి, స్థానిక బస్తీ దవాఖాన వైద్యాధికారి డాక్టర్ హరీష్, మండల పరిషత్ కార్యాలయ జూనియర్ సహాయకురాలు కే. శైలజ పాల్గొని నివాళులర్పించారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు వహీద్, యాదగిరి, కార్యాలయ అటెండర్ పురుషోత్తం (పురుషత్), పలువురు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు మరియు పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి