ప్రెస్ క్లబ్ ఓదెల లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రెస్ ప్రెస్ పొత్కపల్లి భవన్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని సుదర్శన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పని సుదర్శన్ ముదిరాజ్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస,శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పని సుదర్శన్ ముదిరాజ్,కార్యదర్శి మారం తిరుపతి రెడ్డి,ఉపాధ్యక్షులు చెరుకు శంకర్,ప్రెస్ క్లబ్ సలహాదారుడు ఇరుకుల వీరేశం, పాత్రికేయులు సల్పాల ప్రశాంత్,రవీంద్ర చారి పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


