సర్(SIR) సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ : సర్ ప్రక్రియ నూరు శాతం పూర్తి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం హసన్పర్తి మండల కేంద్రంతో పాటు 66వ డివిజన్ నాయకులతో విజయ గార్డెన్స్ లో సర్ ప్రక్రియ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.సర్ ప్రక్రియను 100% విజయవంతంగా వేగంగా పూర్తిచేయాలని పార్టీ శ్రేణులకు BLA లకు దిశా నిర్దేశం చేశారు. అర్హుడైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటర్ జాబితా నుండి తొలగిపోకుండా BLA లు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు చాలా ముఖ్యమని, ఓటు ఉంటేనే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ వైస్ ఛైర్మన్ తిరుపతి, హసన్పర్తి మండల అధ్యక్షులు రేణుకుంట్ల అశోక్,66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్,మాజీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి,మాజీ డివిజన్ అధ్యక్షులు కిరణ్,సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాకేష్ రెడ్డి,సీనియర్ నాయకులు,జిల్లా కమిటీ నాయకులు,మండల,డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
