ఎల్‌నినో ప్రభావం తక్కువ..
ఉద్యాన పంటల సాగుతో రైతులకు ప్రయోజనం
ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, కాయగూరల సాగుపై రైతులు దృష్టి సారించాలి: హార్టికల్చర్ అధికారి రామకృష్ణ
బిచ్కుంద,: ఎల్‌నినో ప్రభావం తక్కువగా ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావాలని బిచ్కుంద మండల హార్టికల్చర్ అధికారి రామకృష్ణ సూచించారు. రైతులు కేవలం సాంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా ఉద్యానవన పంటల సాగుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో పాటు వివిధ రకాల పండ్ల తోటలు, కాయగూరలు, ఇతర ఉద్యాన పంటలు మరియు పర్యావరణా నికి ఉపయోగపడే వివిధ రకాల చెట్లను విస్తృతంగా సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు వ్యవసాయంలో పంటల వైవిధ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలని, సంబంధిత శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉద్యానవన శాఖ పథకాలు, ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల హార్టికల్చర్అ ధికారి రామకృష్ణ, బిచ్కుంద ఏఓ అమర్, ఏఈఓలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
Views: 113
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
