వరంగల్‌లో ఉబర్‌ బైక్ సేవలు, నగరానికి విస్తరణ.

బైక్ ఉబర్ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే KR నాగరాజు 

వరంగల్‌లో ఉబర్‌ బైక్ సేవలు, నగరానికి విస్తరణ.

 
 

హన్మకొండ /వరంగల్‌ : ప్రముఖ క్యాబ్‌ సంస్థ ఉబర్‌, తెలంగాణలోని వరంగల్‌లో తన సేవలను ప్రారంభించింది.వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  సోమవారం ఉబర్ బైక్ సేవలను ప్రారంభించారు. వరంగల్‌లో తొలుత ఆటో, కార్ బుక్కింగ్‌ను అందుబాటులోకి తేగా.... ఈ మైలురాయి దాటి ఉబర్ బైక్ సేవలను అందుబాటులోకి రావడం సంతోషమన్నారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే నాగరాజు ,బండి చైతన్య రెడ్డి  ఉబర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపగా వారి ఆదేశాల మేరకు ఉబర్ బైక్ సేవలు సోమవారం వరంగల్ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో ఈ ఉబర్ బైక్ సేవలు అందుబాటులోకి రావడాని స్వాగతించారు. మూడు అర్బన్‌ నగరాలైన కాజీపేట, హన్మకొండ, వరంగల్ మధ్య సమర్థవంతమైన కనెక్టివిటీని పెంచడంలో ప్రభుత్వ, ప్రైవేట్ సహకారాలు చాలా దోహదపడతాయని తెలిపారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయానికి తొలి, చివరి మైలు కనెక్టివిటీని అందిస్తుందన్నారు.ఉబర్ బైక్ సేవలను అందిస్తున్న తొలుత 20 మంది బైక్ రైడర్స్ కి హెల్మెంట్లను అందజేశారు.ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రజా సేవలో నిత్యం రోడ్డుపై ప్రయాణిస్తున్న తన సిబ్బందికి సైతం హెల్మెంట్లను అందేశారు.వరంగల్ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్న ఉబర్ బృందానికి విజయాలు కలగాలని ఆకాంక్షించారు.వరంగల్ నివాసితుల కోసం బైక్ రైడింగ్ సేవను ప్రారంభించినందుకు ఉబర్‌ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోఉబర్ బెంగుళూరు ప్రతినిధులు గీతు నిత్యానందన్,రాయుడు వేణుశ్రీ తేజ,వరంగల్ ఉబర్ ప్రతినిధులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News