ఐలయ్య శస్త్ర చికిత్సపై సంతృప్తి
మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ పూర్తి చేసుకున్న ఐలయ్య శస్త్ర చికిత్సపై కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆసుపత్రి డీవైసీఎంవో మధు కుమార్ పేర్కొన్నారు. శస్త్ర చికిత్స సమయంలో ఐలయ్యకు వేసిన కుట్లను వైద్యుల సమక్షంలో సోమవారం తొలగించి నడిపించినట్లు తెలిపారు. అనుభవం కలిగిన వైద్యుల సహకారంతో అత్యాధునిక ఆర్థోపెడిక్ వైద్య సేవలు కార్మిక కుటుంబసభ్యులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థోపెడిక్ వైద్యులు సుహాసిని,నరేష్,అనస్థీషియా మధుకర్,ఓటి ఇంచార్జ్ జ్యోతి,సిబ్బంది సమిష్టిగా కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.
Views: 71
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
