పోలీస్ శాఖలో కృత్రిమ మేధస్సు – సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ

పోలీస్ శాఖలో కృత్రిమ మేధస్సు – సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ

పీటీసీలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్,: ఆధునిక సాంకేతికతతో నేర నియంత్రణ, దర్యాప్తులో సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "కృత్రిమ మేధస్సు మరియు పోలీసు శాఖ సాంకేతికతలు" శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ పోలీస్ శిక్షణా కేంద్రంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి పరిస్థితుల్లో పోలీసు శాఖ కూడా అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.  కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ భద్రత, సమాచార విశ్లేషణ, స్మార్ట్ నిఘా వంటి ఆధునిక సాంకేతికత నేరాల నియంత్రణ, దర్యాప్తు, ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2018, 2020 మరియు 2024 బ్యాచ్‌లకు చెందిన కానిస్టేబుళ్లకు ఈ ప్రత్యేక శిక్షణను నిర్వహిస్తు న్నామని చెప్పారు. ఇందులో భాగంగా కరీంనగర్ పోలీస్ శిక్షణా కేంద్రంలో నిజామాబాదు, కరీంనగర్, సిద్దిపేట మూడు పోలీస్ కమిషనరేట్లు మరియు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, ఆసిఫాబాద్ ఆరు జిల్లాలకు చెందిన సిబ్బందికి మొత్తం 11 దశల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారుప్రతి దశలో 80 మంది కానిస్టేబుళ్లు పాల్గొంటారని, ప్రతి బ్యాచ్‌కు ఐదు రోజుల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారుశిక్షణలో కృత్రిమ మేధస్సు ఆధారిత పోలీసింగ్, డిజిటల్ ఆధారాల నిర్వహణ, సైబర్ నేరాల గుర్తింపు, స్మార్ట్ నిఘా వ్యవస్థలు, దర్యాప్తులో సాంకేతిక వినియోగం, సమాచార విశ్లేషణ, నైతిక విలువలు, గోప్యతా నిబంధనలు, చట్టపరమైన అంశాలపై నిపుణులచే ఆచరణాత్మక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారుఈ శిక్షణతో పోలీసు సిబ్బంది సాంకేతికంగా మరింత నైపుణ్యం సాధించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తారని సీపీ ఆకాంక్షించారు. తెలంగాణ పోలీసు శాఖను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతికంగా బలోపేతం చేయడంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారుఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్ అదనపు ఎస్పీ ఎం. పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ ఏసీపీ గంగాధర్, ఏసీపీలు విజయపాల్ రెడ్డి, బి. నారాయణ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News