రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి, ఆదాయం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాల మేరకు తమ ప్రాంతానికి అనువైన పంటలను ఎంపిక చేసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, పశుసంవర్ధక రంగం, కూరగాయల సాగు చేపడితే రైతులకు సంవత్సరం పొడవునా ఆదాయం లభిస్తుందని వివరించారు. ప్రతీ గ్రామంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు ఉద్యానవన, ప్రత్యామ్నాయ పంటలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Views: 58
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
