చౌటకూర్ జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు శ్రీకారం
చౌటకూర్, సంగారెడ్డి : చౌటకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్‌పీహెచ్‌ఎస్) బయట పరిసరాలను పరిశుభ్రంగా, విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ పార్కుల రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల వెలుపల పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మొరం వేయించే పనులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ సుభాష్‌రెడ్డి ముఖ్యంగా సహకరించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ పార్కుల రామ్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు రాలు అనురాధ, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, వినయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, రాజేశ్వర్ గౌడ్, కరుణాకర్, వార్డు సభ్యులు అశోక్, చక్రపాణి, గంగారాం తదితరులు పాల్గొని పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తామని తెలిపారు.
Views: 60
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
