కాకా కుటుంబంపై విమర్శలు మానుకోవాలి

మంత్రి,ఎంపీపై మాట్లాడే నైతిక అర్హత లేదు

కాకా కుటుంబంపై విమర్శలు మానుకోవాలి

మందమర్రి, (మంచిర్యాల) : బీఆర్ఎస్ నాయకులు కాకా కుటుంబంపై విమర్శలు మానుకోవాలని రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులకు చెన్నూరు ఎమ్మెల్యే,కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. శనివారం స్థానిక సూపర్ బజార్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రిగా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అలాగే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News