ఏరియా వర్క్‌షాప్‌లో జీఎం శాలెం రాజుకు ఘన సన్మానం.
కొత్తగూడెం, : ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుకు సోమవారం ఏరియా వర్క్‌షాప్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గుర్తింపు కార్మిక సంఘాల నాయకులు, ఎస్సీ–ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామవరం ప్రాంతానికి చెందిన శాలెం రాజు కష్టపడి చదువుకుని నాగ్‌పూర్‌లో మైనింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సింగరేణి సంస్థలో అండర్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవడం ఆయన కృషికి నిదర్శనమని కొనియాడారు. జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కొత్తగూడెం ఏరియాను బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థలోనే అగ్రగామిగా నిలిపేందుకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి ఏరియా అభివృద్ధికి కీలకంగా పనిచేశారని తెలిపారు. అనంతరం శాలెం రాజును అధికారులు, గుర్తింపు కార్మిక సంఘాల నాయకులు, ఎస్సీ–ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, పదవీ విరమణ అనంతర జీవితంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం గోవిందరావు, ఏరియా ఇంజనీర్ రామకృష్ణ, ఏరియా వర్క్‌షాప్ హెచ్‌వోడి క్రిస్టోఫర్, అధికారులు శంకర్, అనిల్, ఉపేందర్ బాబు, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మధుకృష్ణ, ఐఎన్‌టీయూసీ పిట్ కార్యదర్శి సత్తార్ పాషా, గుమ్మడి వీరయ్య, గుమ్మడి మురళి, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ మెంగని రోషన్, కరుణాకర్, వెంకట్రామ్, రమేష్ బాబు, రాంధని, చందూలాల్, సిద్దిరాల రాజకుమారస్వామి, నరేష్, ప్రభాకర్, పరశురాములు, మెంగని అశోక్, కస్తూరి రమేష్, అనూష, వెంకట దుర్గ, వసంతిక, రమణ, సంధ్యారాణి, ఈశ్వర్, మహేష్, యాకుబుద్దీన్, టి.ఆర్.ఎస్. రాజు, రాజయ్య, బొజ్జ వెంకటస్వామి, ముజాహిద్దీన్, అత్తహర్ పాషా, దుర్గప్రసాద్, సామ్యూల్ సుధాకర్, గోపాల్, వెంకట్, ఐ.ఎస్. సమ్మయ్య, తుమ్మల శ్రీనివాస్, మురళి, చిప్ప నరేష్, గుంట పరశురామ్, టి. రమేష్, బాబాదిన్, కిరణ్, సలిగంటి శ్రీనివాస్, సముద్రాల శ్రీనివాస్, రహీం పాషా, ప్రకాష్, కరీం, గౌస్, ప్రవీణ్ కుమార్, సంపత్ మోహన్, జయరాజు, చంద్రశేఖర్, యేసురత్నం, ఖాజా పాషా, మోహన్‌లాల్‌తో పాటు ట్రేడ్ అప్రెంటిస్‌లు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 62
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
