ఘనంగా పగడాల మంజుల పుట్టినరోజు వేడుకలు
కారేపల్లి (ఖమ్మం) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిపారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ మణియర్ ఆధ్వర్యంలో కారేపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పగడాల మంజుల పుట్టినరోజుని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ఆమె మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్, సర్పంచ్ పొడుగు పెంటయ్య,ఉప సర్పంచ్ తాటి రామారావు,ఆత్మ కమిటీ డైరెక్టర్ గుండ్ల జగన్నాథం,బిసి సెల్ అధ్యక్షుడు బోళ్ల రమేష్,మాజీ సొసైటీ డైరెక్టర్ ఆదేర్ల రాములు,మైనార్టీ సెల్ తాజుద్దీన్,మాజీ కోఆప్షన్ సభ్యులు హనీఫ్,మైనారిటీ జిల్లా నాయకులు మజీద్ పాషా,గ్రామ శాఖ అధ్యక్షుడు చాగంటి చిన్న వెంకటేశ్వర్లు,తుడుం దెబ్బ జిల్లా నాయకులు కురుసం సత్యనారాయణ,వైరా సోషల్ మీడియా కన్వీనర్ కనకం పవన్ కళ్యాణ్, సన్నీ,వేమూరి తామస్ తదితరులు పాల్గొన్నారు.
Views: 136
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
