కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ కోరారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని గురువారం రాత్రి ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని దేవీ రోడ్డు - నాందేవాడ (ఆర్ వోబీ) అదనపు వంతెన మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. ప్రధానంగా ఈ రైల్వే లైను దాటడానికి విజయ థియేటర్, అలాగే నాందేవాడ వద్ద రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. రద్దీ ఎక్కువగా కావడంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదని, కావున నూతన ఆర్ వోబీ మంజూరు చేయాలన్నారు. అలాగే ఎల్లమ్మగుట్ట వద్ద సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో మరొక ఆర్ యూబీ అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం రూ.170 కోట్లు మంజూరుకావాలన్నారు.
 
 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి