బిజెపి ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నాగు ముదిరాజ్ నియామకం

బిజెపి ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నాగు ముదిరాజ్ నియామకం

గజ్వేల్ (సిద్దిపేట) : భారతీయ జనతా పార్టీ (బిజెపి) సిద్దిపేట జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా మామిండ్ల నాగు ముదిరాజ్ నియమితుల య్యారు. తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర నాయకులు రామచంద్ర రావు, మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లన్నగారి భిక్షపతి, నియోజకవర్గంలోని ప్రతి మండల పార్టీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, తోటి కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మామిండ్ల నాగు ముదిరాజ్ మాట్లాడుతూ తన పై నమ్మకంతో పార్టీ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు శ్రేణులందరికీ రుణపడి ఉంటానన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అందరినీ కలుపుకొని పోతూ, నిరంతర శ్రమ, పట్టుదలతో సిద్దిపేట జిల్లాలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 
Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి