ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 

 హన్మకొండ న్యూస్ :     హనుమకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగ కళాకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని.   రాష్ట్ర అధ్యక్షుడు అన్నోజి వీరన్న,హనుమకొండ, వరంగల్ జిల్లాల  అధ్యక్షులు రవి ,రాజు   డిమాండ్ చేశారు. 'తెలంగాణ సాంస్కృతిక సారధి' సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించి, కళాకారులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులందరినీ ఏకంచేసి రానున్న రోజుల్లో మరింత పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో సంస్కృతిక సారధిలో ఉద్యోగాలు రాని నిరుద్యోగ కళాకారులకు 2వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాట చెప్పారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జ కట్టి గొంగడేసి ఆటపాటలతో ధూంధాం కార్యక్రమాలను చేపట్టామని.. అలాంటి కళాకారులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోవడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో సంస్కృతిక సారధిలో కొంతమందికే ఉద్యోగ అవకాశాలు కల్పించారాణి వాపోయారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు