కేపీహెచ్బీలో ఫన్ ఫేర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ప్రారంభం
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు కోటంరెడ్డి వినయ్ రెడ్డి
కూకట్ పల్లి : కేపీహెచ్బీ కాలనీలో మంగళవారం ఫన్ ఫేర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షుడు కోటంరెడ్డి వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకుడు రాజిరెడ్డితో కలిసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణలు, వివిధ స్టాళ్ల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రత్యేకమైన పరికరాలతో పాటు వివిధ దేశాలకు చెందిన వ్యాపారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శకులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా సందర్శించేందుకు అనువుగా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా వివిధ రకాల స్టాళ్లు, ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఫన్ ఫేర్ ఎక్స్పోను సందర్శించి ఆనందకరమైన అనుభూతిని పొందాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


