నవరాత్రుల్లో భాగంగా ఏకహం నిర్వహణ
కాటారం (భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మూడవరోజు సందర్భంగా అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి మండపాన్ని కూరగాయలు, వరి , మక్క కంకులు, తామర పుష్పాలతో అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా 24 గంటలు నిరంతరంగా భజనలు నిర్వహిస్తూ ఏకాహం ప్రారంభించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దంపతులు పూజాది కార్యక్రమంలో పాల్గొని అన్నదానం, పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


