అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుతుబుల్లాపూర్ గ్రామంలో గార్డెన్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతిష్టించినారు. మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని, అన్నపూర్ణ దేవి అమ్మవారి మండపము నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కుంట సిద్ధిరాములు, బచ్చ జ్ఞానేశ్వర్ ,మాజి ఎం పి టి సి చంద్రశేఖర్ రెడ్డి , పాల్గొన్నారు కాలని పెద్దలు మహిళలు అన్నదాన కార్యక్రమం లో భారీ ఎత్తున పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


