వలువొజు సుదర్శన్ చారి ఆశాయాలను సాధిస్తాం.
బాధిత కుటుంబాలకు ప్రాణాలర్పించిన సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.
హుస్నాబాద్ నిన్నత విలువలతో భారత కమ్యునిస్టు పార్టీ (సిపిఐ) గ్రామ కార్యకర్త స్తాయి నుండి మండల జిల్లా నాయకుడి హోదాలో పనిచేసిన వలువోజు సుదర్శన్ చారి మరణం సిపిఐ కి అత్యంత తీరని లోటని సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.ఈ సందర్బంగా మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలోని వలువోజు సుదర్శన్ చారి కుటుంబ సభ్యులైన వలువొజు భాగ్యలక్ష్మి, కుమారులు సర్వేశ్వరా చారి,పరమేశ్వరాచారి,సతీశ్వరా చారి, ప్రియాంక,తన్మయి,కేశివిలను చాడ వెంకటరెడ్డి ఓదార్చారు.సుదర్శన్ చారి భారత కమ్యునిస్టు పార్టీ సిపిఐలో నాయకుడిగా ఉండి అనేక ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని ఆనాటి జ్ఞాపకాలను చాడ వెంకటరెడ్డి గుర్తు చేశారు. సుదర్శన్ చారి కుటుంబానికి సిపిఐ ఎల్లప్పుడూ అండ దండగా వుంటుందని చాడ వెంకటరెడ్డి తెలిపారు.అనంతరం గ్రామంలో సిపిఐ సినీయర్ నేత బొనగిరి ఎల్లయ్య అనారోగ్యం బాధపడుతున్నా డని తెలిసి తన నివాసానికి వెళ్లి ఎల్లయ్యను పరమార్శించారు. హుస్నాబాద్ పట్టణం 7 వార్డూకు చెందిన బైరి వీరయ్య కుమారుడు నరిసింహ్మ రోడ్డు ప్రమాదంలో మరణించన బైరి వీరయ్య,లక్ష్మి కుటుంబాన్ని,
9 వార్డూకు చెందిన చెన్నవేని బాలవ్వ చెన్నవేని మంజుల, అక్కన్నపెట మండలం తెనుగుపల్లికి చెందిన మాజీ సర్పంచ్ బోడిగె కొమురయ్య,బైరి లింగయ్య అనారోగ్యం బాధపడుతున్నారని తెలిసి చాడ వెంకటరెడ్డి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి పొదిల కుమారస్వామి, సిపిఐ సినీయర్ నాయకులు మాజీ సర్పంచ్ కొయడ కొమురయ్య, గౌరవెల్లి ఉప సర్పంచ్ మాచర్ల శ్రీనివాస్, సిపిఐ నాయకులు గాంభీరపు మధు, కొమ్ముల పర్శరాం,మంద శ్రీనివాస్,బైరి శ్రీనివాస్,బొడిగె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


