అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
భక్తులతో కిటకిటలాడుతున్న పూజా మండపాలు.. ఆధ్యాత్మిక శోభతో పులకించిన మోస్రా...
మోస్ర విజన్ ఆంధ్ర : మోస్ర మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ప్రత్యేకంగా దుర్గా మాత, అదేవిదంగా అష్టలక్ష్మి మాతల అవతారాలను ఒకే చోట వేర్వేరు మండపాల్లో అత్యంత మనోహరంగా ఏర్పాటు చేశారు. మొదటి రోజు వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం కన్నులపండువగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎనిమిది లక్ష్మి స్వరూపాలు అది లక్ష్మి, ధైర్య లక్ష్మి, విజయలక్ష్మి, ఘజలక్ష్మి, సంతాన లక్ష్మి, విద్య లక్ష్మి, ధన లక్ష్మి, దాన్య లక్ష్మి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి విగ్రహాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, విదేశీ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సమీప ప్రాంతాల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తాగునీరు, ప్రసాద వితరణ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. రాబోయే తొమ్మిది రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నూలు శివ, ముఖ్య సలహా దారుడు కొత్త కాపు రాజారెడ్డి ఈ మహాత్ కార్యక్రమానికి గ్రామస్తులు అందరి సహకారం ఉందని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


