ప్రత్యక్ష రాజకీయాల్లోకి రేణికుంట్ల ప్రవీణ్‌

విజన్‌ 2028కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుత

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రేణికుంట్ల ప్రవీణ్‌

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా:  రేణికుంట్ల ప్రవీణ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఇకపై బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉంటూ రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిని చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.తెలంగాణ ఉద్యమకాలం నుంచే కేసీఆర్‌ వెంట నడుస్తున్నానని, ఆయనపై ఉన్న అభిమానంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని ప్రవీణ్‌ పేర్కొన్నారు. గతంలో కేసీఆర్‌ కల్పించిన అవకాశాలతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యుడిగా పదేళ్లపాటు సేవలందించినట్లు తెలిపారు.విజన్‌ 2028 లక్ష్యంగా ముందుకు సాగుతూ, బెల్లంపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తన పాత్రను విస్తరించుకుంటూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వానికి మద్దతుగా పనిచేయాలని ప్రవీణ్‌ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు