శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి పూజ ఉత్సవాలు
అన్నపూర్ణ దేవిని దర్శించుకున్న దాత దంపతులు లక్ష్మి సంధ్యారెడ్డి, లక్ష్మి నరసింహారెడ్డి
చౌటకూర్:- చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామంలో హనుమాన్ సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమానికి అన్నప్రసాద దాతలుగా వ్యవహరించిన లక్ష్మి సంధ్యారెడ్డి, లక్ష్మి నరసింహారెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం అందించే కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హనుమాన్ సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అన్నపూర్ణ దేవి అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం నిర్వహించడం ద్వారా భక్తులకు సేవ చేసే అవకాశం లభించిందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ బి కిరణ్ గౌడ్, పుట్టి ఆంజనేయులు, దేవుని శ్రీకాంత్, దేవుని సాయి సుజన్, ఉదయ్, జగ్గంపేట రాజు,శ్రీనివాస్ రెడ్డి,వినోద్,భవాని మాత మాల భక్తులు, యువకులు, ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


