చర్ల తాలిపేరు బ్రిడ్జి వద్ద విషాదం నదిలో వ్యక్తి గల్లంతు
భవానీ మాలధారితో కలిసి స్నానానికి వెళ్లిన దగ్గుపల్లి వెంకటేష్ అనే యువకుడు గల్లంతు
చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):చర్ల మండల కేంద్రంలోని తాలిపేరు వాగు బ్రిడ్జి వద్ద బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది, భవానీ మాల ధరించిన ఐదుగురు యువకులతో కలిసి స్నానానికై వెళ్లిన దగ్గుపల్లి వెంకటేష్ అనే సుమరు 23 సంవత్సరాల యువకుడు నీటిలో మునిగి గల్లంతయ్యాడు, ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించిందిస్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చర్లకు చెందిన ఐదుగురు యువకులు భవానీ మాల ధరించి, స్థానికంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు తాలిపేరు వాగు బ్రిడ్జి వద్దకు వెళ్లారు, వారి వెంట గోల్లగట్ట ప్రాంతానికి చెందిన దగ్గుపల్లి వెంకటేష్ 23 సంవత్సరాల యువకుడు కూడా తోడుగా వెళ్లాడు, అందరూ కలిసి నదిలో స్నానం చేస్తున్న సమయాన అకస్మాత్తుగా వారితో పాటు వెళ్లిన వెంకటేష్ నీటిలో మునిగి గల్లంతయ్యాడుఎస్సై నర్సిరెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలుసమాచారం అందుకున్న వెంటనే చర్ల ఎస్సై నర్సిరెడ్డి అప్రమత్తమయ్యారు, వెంటనే తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు, గల్లంతైన వ్యక్తిని రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు, స్థానిక ఈతగాళ్లు, పడవల సహాయంతో తాలిపేరు వాగు నీటిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి మృదేహాన్ని వ్యక్తిశారు,నదీ పరిసర ప్రాంతాల్లో భవానీ మాలధారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


