క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య
హన్మకొండ న్యూస్ : హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యశాలల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ అప్పయ్య తెలిపారు.ఈ నేపథ్యంలో నేడు డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా పలు ఆసుపత్రులను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం, 2010 మరియు సంబంధిత నిబంధనలు, 2012 ప్రకారం ఆసుపత్రులు నిర్వహిస్తున్న వైద్య సేవలు, అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాలు, రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంచాల్సిన కింది అంశాలను అధికారులు తనిఖీ చేశారు.
. వైద్య సేవలకు సంబంధించిన టారిఫ్ జాబితా (చికిత్స రుసుముల వివరాలు) ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలి.
2. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల పేర్లు, అర్హతలు, విధుల వివరాలతో కూడిన వైద్యుల జాబితాను ప్రదర్శించాలి. 3. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ( ఎస్ టి పి )కు సంబంధించిన ధ్రువపత్రాలు, అవసరమైన అనుమతులను పరిశీలించారు. 4. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. 5. కాలుష్య నియంత్రణ మండలి నుంచి పొందిన అనుమతులు, ధ్రువపత్రాలను పరిశీలించారు. 6. మున్సిపల్ శాఖ నుంచి పొందిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఒక్కపాన్సీ సర్టిఫికెట్ ) తదితర అవసరమైన అనుమతులను తనిఖీ చేశారు. 7. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఇతర రిజిస్ట్రేషన్లు, అనుమతులు, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రుల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లయితే సంబంధిత ఆసుపత్రులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఆసుపత్రి బాధ్యత అని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక బృందాలు జిల్లాలోని ఆసుపత్రులను తనిఖీ చేసి, నిబంధనల అమలును పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఆసుపత్రుల యాజమాన్యాలు అవసరమైన అన్ని అనుమతులు, ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకొని అధికారుల తనిఖీలకు సహకరించాలని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


