నాగారం, ఎదులాబాద్ కాంగ్రెస్ కమిటీల ప్రకటన
పార్టీ బలోపేతమే లక్ష్యం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే ధ్యేయం, వజ్రేష్ యాదవ్
మేడ్చల్ మల్లికాజిగిరి జిల్లా: మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని నాగారం, ఎదులాబాద్ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కమిటీలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ బుధవారం ప్రకటించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లక్ష్యంగా నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, పార్టీ బలోపేతానికి సమష్టి కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఎదులాబాద్ డివిజన్ అధ్యక్షుడు సామల అమర్, నాగారం డివిజన్ అధ్యక్షుడు భూమయ్య యాదవ్, నాగారం మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


