వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,

వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,

 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, బాక్స్ నాలా నిర్మించాలని కోరుతూ 04-10-2026 న  డిప్యూటీ కమిషనర్ కి సంబంధిత కాలనీ వాసుల తరఫున రిప్రజెంటేషన్సమర్పించడం జరిగిందని తెలిపారు ఈ రిప్రజెంటేషన్‌కు స్పందించిన జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తో కలిసి 07-10-2026 ఉదయం శ్రీ దుర్గయ్య స్టేట్ కమ్యూనిటీ హాల్‌కు వచ్చారు.అనంతరం హెచ్‌ఏఎల్ రాఘవేంద్ర కాలనీ, ఏరోనాటికల్ ఎంక్లేవ్ మరియు శ్రీ రాఘవేంద్ర కాలనీలలో పర్యటించి వర్షపు నీటి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. బాక్స్ నాలా నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు (ప్రపోజల్స్) సిద్ధం చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  దుర్గయ్య స్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, మధుసూదన్ రావు, హెచ్‌ఏఎల్ రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కుంటా సిద్దిరాములు, ప్రధాన కార్యదర్శి  తోకల నగేష్ రెడ్డి, ఏరోనాటికల్ ఎంక్లేవ్ అసోసియేషన్ అధ్యక్షులు  కీర్తి కనకయ్య, రాఘవేంద్ర కాలనీ అధ్యక్షులు శ్రీ నారాయణ, సతీష్,  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు కాలనీలలో పర్యటించి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఆమె ఇచ్చారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హక్కుల కోసం ఉద్యమించాలి హక్కుల కోసం ఉద్యమించాలి
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి  పూజ ఉత్సవాలు
అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 
అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,