మెడిగూడ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఐదుగురు పేకాటరాయుళ్లు పట్టివేత.. మరో ముగ్గురు పరారీ రూ.38,640 నగదు, 52 పేకాట కార్డులు, 5 సెల్‌ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.....ఎస్ఐ పి గౌతమ్

మెడిగూడ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 14 (విజన్ ఆంధ్ర)ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోరజ్ మండలం మెదిగూడ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు జైనథ్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకోగా, మరో ముగ్గురు పోలీసులను చూసి పరారయ్యారు. మొత్తం 8 మందిపై జైనథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసులు పట్టుకున్న నిందితుల వివరాలు: 1. సయ్యద్ హుస్సేన్ (44), ధనోరా-కె గ్రామం, ఇంద్రవెల్లి మండలం. 2. బుర్రిన్ వినోద్ (40), లాండసాంగ్వి గ్రామం, జైనథ్ మండలం.3. గోపతి ప్రమోద్ (38), మెదిగూడ గ్రామం, సాత్నాల మండలం.4. ధనీర్ దశరథ్ (25), ఇంద్రవెల్లి గ్రామం, ఇంద్రవెల్లి మండలం.5. గొర్ల రాకేష్ (36), లాండసాంగ్వి గ్రామం, ఆదిలాబాద్ మండలం.పరారీలో ఉన్న నిందితులు:6. దుమాని రాకేష్.7. దగె సుధాకర్.8. ఉట్ల శ్రీకాంత్.పట్టుబడిన ఐదుగురు నిందితుల నుంచి పోలీసులు రూ.38,640 నగదు, 52 పేకాట కార్డులు, ఐదు సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే   డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు