ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ ( ఈ హెచ్ ఎస్ ) పథకం అమలుకు థానా కమిటీ సభ్యుల అంగీకారం

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ ( ఈ హెచ్ ఎస్ ) పథకం అమలుకు థానా కమిటీ సభ్యుల అంగీకారం

 హన్మకొండ  :   హనుమకొండ జిల్లాలో గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ( ఈ హెచ్ ఎస్ ) అమలు చేసేందుకు థానా కమిటీ సభ్యులు అంగీకరించారు. గౌరవ హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్, ఐఏఎస్  సమక్షంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని, గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ పథకాన్ని అమలు చేసేందుకు సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ఉద్యోగులు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ, హనుమకొండ జిల్లాలో గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ పథకం అమలుకు థానా కమిటీ సభ్యులు అంగీకరించడం సంతోషకరమని తెలిపారు. పథకం అమలుకు సంబంధించి అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ఉద్యోగులకు వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో థానా కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాకేష్, ప్రదాన కార్యదర్శి డాక్టర్ రమేష్ సభ్యులు డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి,  డాక్టర్ విజయ్, డాక్టర్ బి మోహన్ రావు అడిషనల్ డి ఎమ్  & హెచ్ ఓ డాక్టర్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు