పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు
చౌటకూర్ :- విజయదశమి లలిత్ పంచమీని పురస్కరించుకొని తీసుకునే గిరిజనుల భవాని మాత సేవాలాల్ మహారాజ్ దీక్షల మాల విరమణ కై బుధవారం నాడు చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం దీక్షా మహారాజ్ లు బయలుదేరారు గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బొమ్మరెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ 108 రోజుల దీక్ష మహారాజ్ జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో దీక్ష మహారాజ్ లకు పూలమాలతో సత్కరించి ప్రత్యేక పూజలు బోగ్ బండర్,భజన కార్యక్రమం గిరిజన సాంస్కృతిక సాంప్రదాయా నూత్యాలు నిర్వహించారు ఈ సందర్భంగా జైపాల్ నాయక్ మాట్లాడుతూ 108, రోజులు 41,21,11 రోజులపాటు తీసుకునే దీక్ష వలన గిరిజనులు మధ్యానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండి దీక్ష తీసుకోవడం వలన గిరిజనుల్లో మార్పు, చైతన్యం వస్తుందన్నారు ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు దీక్ష తీసుకోవడంతో దీక్షాకాలంతో పాటు అనంతరం కూడా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతున్నారని ఇదే విధంగా ప్రతిసారి దీక్షలను అధిక సంఖ్యలో కొనసాగించాలని భక్తి భావంతో ఉండాలని అన్నారు గ్రామ అభివృద్ధికై అందరు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో దీక్ష మహారాజ్ దేవిదాస్ హెడ్మాస్టర్ మోహన్ లాల్,సురేందర్, రాజు గౌతమ్, జైల్ సింగ్, శివాజీ, ధనరాజ్ అఖిల్, సంతోష్ శివాజీ అభిలాష్, మెదక్ డి టి ఎఫ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ నాయక్ విశ్రాంత జిల్లా అధికారులు ఖోల విట్టల్, రంగారావు, తారసింగ్, కిషన్,శంకర్ నాయక్,రవీందర్ కార్బరి, ఉప సర్పంచ్ రజనీ గోపాల్ వార్డు సభ్యులు సుభాష్ మేనక, నీలా,రాజు, గణపతి నాయక్,రఘు నాయక్, గ్రామ ప్రజలు గిరిజన మహిళలు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


