అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 

అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 

 లక్సట్టిపేట : మండలంలోని గుల్లకోట స్టేజి సమీపంలో అడవిపందిని ఢీకొని  బైక్ పై వస్తున్న దుర్గం రాములు అనే 48 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడని ఎస్సై గోపతి సురేష్ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుని స్వగ్రామం దౌడేపల్లి, ఐకెపిలో సి ఎ గా పని చేస్తున్నాడు. నిన్న ఉదయం నాలుగు గంటలకు అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కి చెందిన కొంతమంది ఏజెంట్లతో కలిసి విజయవాడ దైవదర్శనం కి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుండి తన బైక్ పై వెళ్లి బైక్ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పెట్టి విజయవాడ దైవదర్శనం ముగించుకుని అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ట్రైన్ దిగి తన బైక్ పై దౌడేపల్లి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో గుల్లకోట స్టేజ్ సమీపంలోని రహదారిపై అడవి పంది అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి అడవి పంది ఢీకొని కిందపడి తలకు బలమైన రక్తపు గాయమై అక్కడికక్కడ చనిపోయాడు మృతునికి భార్య ఇద్దరు కుమారుల సంతానం కలరు మృతుని భార్య సుభాషిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హక్కుల కోసం ఉద్యమించాలి హక్కుల కోసం ఉద్యమించాలి
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
శివంపేటలో గ్రామంలో ఘనంగా అన్నపూర్ణ దేవి నవరాత్రి  పూజ ఉత్సవాలు
అడవి పందిని ఢీకొని ఐకెపి సీఏ మృతి 
అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి రూపాల ప్రతిష్ఠాపన.....
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి:    డిప్యూటీ కమిషనర్ కు కాలనీవాసుల వినతి,